• ఫోర్త్ సిటీ అందుకోసమే.! రేవంత్ పై బండి సంజయ్ ఆరోపణలు!
  • ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ - ఆగస్ట్ 15 నుంచి కొత్తగా మూడు పథకాలు అమలు! - అన్న క్యాంటీన్ల అమలుపై ఫోకస్
  • నైపుణ్య గణనకు ఏపీ అధికారుల కసరత్తు - నైపుణ్య గణనకు ప్రత్యేక యాప్ సిద్ధం - రెండు నెలల్లోనే గణన పూర్తికి కసరత్తు
  • ఏపీలో రేషన్ కార్డు దారులకు శుభవార్త - రేషన్ పంపిణీపై చంద్రబాబు కీలక ఆదేశాలు - ఎండీయూ వాహనాలపైనా నిర్ణయం !
  • తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ పై ఆనంద్ మహీంద్ర కీలక నిర్ణయం - ఆటోమోటివ్ డిపార్ట్‌మెంట్‌ దత్తత కోసం కసరత్తు !

ఎవరివైపు మెజారిటీ సర్వేలు ఉంటే వారే విన్నర్లా..?

మెజారిటీ సర్వేలు ఎవరివైపు?

ఓవ‌రాల్ గా 32 స‌ర్వేలు త‌మ త‌మ ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు ఇవ్వ‌గా.. వాటిలో 24 స‌ర్వేలు వైసీపీ వ‌స్తుంద‌ని ఘంటా ప‌థంగా చెప్ప‌గా.. ఓ ఎనిమిది స‌ర్వేలు మాత్రం టీడీపీ వ‌స్తుంద‌ని చెప్పాయి. వీటిలో కేకే స‌ర్వేనే మ‌రీ విడ్డూరం ఏకంగా 161 స్థానాలు కూట‌మికి వ‌స్తాయ‌ని తేల్చి చెప్పేసింది. మ‌రి వైసీపీ కి అంత గ్రాండ్ నెంబ‌ర్ ఇవ్వ‌లేదా అంటే ఉంది.. అది WRAP- 158.

ఇక పార్ధాదాస్- 110- 120, జ‌న్మ‌త్ పోల్స్- 95- 103, టీవీ9 పోల్- 110- 120, ఆరా మ‌స్తాన్- 94- 104, ఆత్మ‌సాక్షి- 98- 116, హెచ్ఎంఆర్- 91- 101, క్యూ మెగా- 120+, ఏబీపీ సీ ఓట‌ర్- 97- 108, పొలిటిక‌ల్ ల్యాబ్- 108, రేస్- 117- 128, ఎన్డీఏ ఎగ్జిట్ పోల్- 143, ఎల్ ఆర్ స‌ర్వే- 93, నాగ‌న్న స‌ర్వే- 118, సీ నెక్స్ట్ ఏపీ- 123, ఎస్. ఏ. ఎస్ గ్రూప్- 126, కేఎస్ ప్ర‌సాద్- 146, కోగంటి స‌త్యం- 110- 125, పోల్ స్ట్రాట‌జీస్- 115- 125, అగ్నివీర్- 124- 128, పొలిటిక‌ల్ ల్యాబ్- 108, ఆప‌రేష‌న్ చాణ‌క్య‌- 95- 102., వైసీపీ వ‌స్తుంద‌ని చెప్ప‌గా..

చాణ‌క్య స్ట్రాట‌జీస్- 114- 125, రింగ్ టూ పోల్- 115, పీపుల్ ప‌ల్స్- 111- 135, నేష‌న‌ల్ ఫ్యామిలీ- 104- 115, పైనీర్- 144, పోల్ ప‌ల్స్- 108- 116, రైస్- 123 టీడీపీ కూట‌మికి భారీ మెజార్టీ క‌ట్టబెట్టాయి.

ఇక కేంద్రంలో ఎన్డీయే హవాకు ఒక అడ్డంటూ లేద‌న్న‌ట్టుగా సాగాయి అన్ని స‌ర్వేలు. ప్ర‌తి స‌ర్వే 350+. కొన్ని నేష‌న‌ల్ స‌ర్వేలు అయితే ఏపీలో ఎంపీల సంఖ్య త‌గ్గించినా.. అసెంబ్లీలో మాత్రం వైసీపీకే ప‌ట్టం క‌ట్టాయి.చాలా మంది చ‌ర్చ ఏంటంటే.. సెంట్ర‌ల్లో క్లారిటీ వ‌చ్చింది కానీ స్టేట్ లో ఇంకా గంద‌ర‌గోళ‌ముందండీ అంటూ ఒక కొత్త రాగం అందుకున్నారు.

ఆరా మ‌స్తాన్ చెప్పిన‌ట్టు.. ఇది పేద‌ల‌కు\ పెత్తందారుల‌కూ మ‌ధ్య సాగిన యుద్ధం మాత్ర‌మే కాదు. ఆంధ్ర ఆడ‌ప‌డుచులు- ఆంధ్ర మ‌గ‌ప‌డుచుల‌కు మ‌ధ్య సాగిన‌ సంకుల స‌మ‌రం కూడా. ఈ స‌మరంలో ఆడ‌వారు ఎవ‌రి వైపు ఉన్నారో.. వారే అంతిమ విజేత‌ల‌వుతుంటారు. అందులో నో డౌట్.

ఇప్పుడు 32 స‌ర్వేల్లో మెజార్టీ స‌ర్వేలు ఎవ‌రి వైపున్న‌ట్టు? ఎవ‌రి వైపు మెజార్టీ ఉంటే వారే క‌దా విన్న‌ర్లు అనే వాళ్ళు లేకపోలేదు... సర్వేలు లేవు ఎం లేవు ప్రజా తీర్పు ఈవీఎంలలో ఉందిగా కొంచం ఓపిక పడితే ఫుల్ క్లారిటీ వస్తుంది జస్ట్ వెయిట్ అండ్ సీ అంటున్నారు రాజకీయా విశ్లేషకులు.

Journalist Rafi

Comment As:

Comment (0)