Red BBC News
బాబాయ్ గెలుపు తర్వాత మళ్ళీ పిఠాపురానికి రామ్ చరణ్..!
Saturday, 01 Jun 2024 18:30 pm
Red BBC News

Red BBC News

ఎన్నికల ప్రచారంలో భాగంగా రామ్‌ చరణ్ పిఠాపురంలో పర్యటించిన విషయం తెల్సిందే. బాబాయికి మద్దతుగా పిఠాపురంలో సందడి చేసిన రామ్ చరణ్ చివరి దశ ప్రచార సందడిలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఎన్నికల ముందు పిఠాపురంలో పర్యటించిన చరణ్‌ ఫలితాలు వచ్చిన తర్వాత రోజు కూడా పిఠాపురంలో సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ గెలుపు ఖాయం అంటూ మెజార్టీ మీడియా సంస్థల యొక్క ఎగ్జిట్‌ పోల్స్ రిజల్ట్స్ లో వెల్లడి అయింది.

ఇలాంటి సమయంలో జూన్‌ 5న పిఠాపురంలో మనమే సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుక కి హాజరు అయ్యేందుకు రామ్‌ చరణ్‌ ఓకే చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పిఠాపురంలో బాబాయి గెలవడం ఖాయం, అందుకే రామ్‌ చరణ్‌ అక్కడికి మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం హాజరు అవ్వడంతో పాటు విజయోత్సవ వేడుకలో హాజరు అవ్వబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ మరియు స్థానిక జనాలు మాట్లాడుకుంటున్నారు. శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో రూపొందిన మనమే సినిమాలో శర్వానంద్‌ మరియు కృతి శెట్టి జంటగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వారంలోనే విడుదల అవ్వబోతున్న మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను పిఠాపురంలో ఎందుకు ప్లాన్‌ చేశారు అనేది క్లారిటీ లేదు.

మొత్తానికి రామ్‌ చరణ్‌ మరోసారి పిఠాపురంలో సందడి చేయబోతున్నాడు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి. బాబాయి అడ్డాలో రామ్‌ చరణ్‌ అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో భారీ స్వాగతం పలికేందుకు గాను మెగా ఫ్యాన్స్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు ఇంకా నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.